Tue01232018

Last update10:41:24 PM

15th PARTHI YATRA

వైభవం గా శ్రీకాకుళం జిల్లా 15వ పర్తియాత్ర

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీకాకుళం జిల్లా 15వ పర్తియాత్ర జిల్లా అద్యక్షులు శ్రీ గంగుల రమణబాబు వారి అధ్వర్యంలో తే17.12.2016ది శనివారం ఉదయం ప్రారంభం అయి  తే19.12.2016ది సోమవారం మధ్యాహ్నంతొ ముగిసింది. 17వ తేదీ నాటికి సుమారుగా 1500 మంది భక్తులు శ్రీకాకుళం నుండి ప్రశాంతి నిలయానికి చేరుకొన్నారు.

               17వ తేదీ ఉదయం సాయి కుల్వంత్ హాల్ లో స్వామి వారి దర్శనం చేసుకొని  భజనలో  పాల్గొన్న అనంతరం  సాయి భక్త నివాస్ ఎదురుగా గల ఆడిటోరియమ్ లో తండూలార్చన మరియు తపోవనం పారాయణం కార్యక్రమం జరిగింది. సాయంత్రం సాయి కుల్వంత్ హాల్ లో  జరిగిన నామ సంకీర్తనలో జిల్లా భక్తులందరు పాల్గొన్నారు. రాత్రి 8.00 గంటల నుండి  గౌరవ ట్రస్టీ శ్రీ ఆర్ జె రత్నాకర్ గారు “ హృదయ నివాసి – పుట్టపర్తి వాసి శ్రీ సత్యసాయి” అనే అంశము మీద ఆద్యాత్మిక ఉపన్యాసం చేస్తూ పర్తియాత్ర అనే భావన మొట్ట మొదటగా శ్రీకాకుళం జిల్లా తోనే ప్రారంభం అయిందని తెలిపి 2004- శ్రీకాకుళం జిల్లా పర్తియాత్ర నుండి  శ్రీకాకుళం జిల్లాతో తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకొన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్తియాత్ర  భావన భారతదేశానికే కాకుండా ప్రపంచానికే స్పూర్తి అయ్యిందని తెలిపారు.

                 18వ తేదీ ఉదయం 5.00 గంటల నుండి చిత్రావతినది  హారతి అనంతరం పుట్టపర్తి పుర వీధులలో  సుమారు కిలో మీటరు మేర  మహా నగర సంకీర్తన జరిగింది .  ఉదయం 9.00 గంటల నుండి సాయి కుల్వంత్ హాల్ లో శ్రీకాకుళం జిల్లా భక్తులచే నామ సంకీర్తన జరిగింది. అనంతరం శ్రీకాకుళం జిల్లా షెడ్ లలో సామూహిక సత్యసాయి వ్రతాలు జరిగాయి. శ్రీకాకుళం  జిల్లా అధ్యనమండలి భాధ్యులు శ్రీ వూణ్ణ లక్ష్మణమూర్తి గారు రచించిన “నిత్య జీవితంలో భగవద్గీత” అనే గ్రంధాన్ని విడుదల చేయడం జరిగింది. సాయంత్రం సాయి కుల్వంత్ హాల్ లో రాజాం జోన్ బాల వికాస్ చిన్నారులచే శ్రీ యం యస్ ప్రకాశరావు గారు రచించిన మరియు వారి దర్శకత్వంలో “శ్రీసత్యసాయి భక్తి సామ్రాజ్యం” నృత్య కధా రూపకం స్వామి వారి సన్నిధి లో ప్రదర్శించడం జరిగింది.

              19వ తేదీ ఉదయం స్వామి వారు జన్మించిన పరమ పవిత్ర మయిన ప్రదేశంలో గల శివాలయంలో శివలింగానికి సప్త నదులు  వంశధార, నాగావళి, బాహుద, మహేంద్ర తనయ, గోదావరి, కృష్ణ, చిత్రావతి జలాలతొ శ్రీకాకుళం జిల్లా భక్తులందరితో అభిషేకాలు నిర్వహించడం జరిగింది.

అనంతరం పుట్టపర్తి దరి “మైలసముద్రం” గ్రామంలో గ్రామ సేవ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ దేవరశెట్టి అమరనాధరావు   గారి సౌజన్యంతో 150 మంది  వృద్ధులకు దుప్పట్లు, మరియొక 50 మందికి తువ్వాళ్ళు, పంచెల పంపిణీ కార్యక్రమం జరిగింది.

               జిల్లా అద్యక్షులు శ్రీ రమణబాబు మాట్లాడుతూ సగానికి మందికి పైగా కొత్త భక్తులు పాల్గొనడం ఆనందం గా ఉంది అన్నారు. ఈ స్పూర్తితో జిల్లాలో నిత్యము జరుగుతున్న అధ్యాత్మిక, సేవ కార్య క్రమాలలో అందరూ భక్తులు పాల్గొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. మహా మంగళ హారతి తొ కార్యక్రమం ముగిసింది. 

Report by: R.Kishor, Dist.IT Incharge,Srikakulam, Phone: 8332041839, Mail: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

pys21

pys22

pys23

pys24

pys25

pys26

goru

pys31

pys32

pys33

pys36

pys30

pys37

py2

py3

py4

py6

 

   

 

                                                                                                               

Activities
Youth Activities
Bala Vikas Activities