Sun07222018

Last update10:37:21 AM

Grama Seva Maha Yagnam -27/10/2017 – Pedda Mandiram, Srikakulam

ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, స్వామి వారి 92వ జన్మదిన వేడుకలు సందర్భంగాశ్రీ సత్యసాయి సేవా సమితి, పెద్ద మందిరం, శ్రీకాకుళం వారి ఆధ్వర్యంలో తే.27-10-17ది. శుక్రవారం ఉదయం గం.7 నుండి 10 గం వరకు ఎచ్చెర్ల మండలం లో గల O. A. అగ్రహారం గ్రామంలో అత్యంత వైభవంగా గ్రామసేవ జరిగింది.గ్రామసేవలో ఈ దిగువ కార్యక్రమాలు జరిగినవి.

1)గ్రామంలో పల్లకిలో స్వామి వారి చిత్రపటం తో గ్రామ సంకీర్తన చేసిరి

2)సుమారు 120 మంది పిల్లలు, పెద్దలకుDr. L.లక్ష్మణరావు,Dr. J. అనూరాధ,Dr. K. భానుమూర్తి గార్లు    వైద్యసేవలు అందజేసి మందులను ఉచితంగా ఇఛ్చిరి.....

3)92 మంది వృద్ధ మరియు వితంతు మహిళలు, పురుషులకు చీరలు, దుప్పట్లు, పంచిరి.

4)33 మంది పాఠశాల విద్యార్థులకు రంగు రంగుల నూతన వస్త్రాలను శ్రీ N. V. కృష్ణ గారి సౌజన్యంతోను   కామేశ్వరి బుక్స్ వారి వితరణ తో నోట్ బుక్స్ అందజేసిరి.

5)చల్ల భారతి, 6వ తరగతి చదువుచున్న బాలికకు 3 km.దూరంలో గలా కొయ్యాం ఉన్నత పాఠశాలకు    వెళ్లుటకు గాను చిన్న సైకిల్ ను శ్రీ శిల్లా శ్రీరామ మూర్తి గారు అందజేసిరి.

6)విద్యార్థులకు బలవికాస్ తరగతి నిర్వహించిరి

7)ప్రతి కుటుంబానికి స్వామి వారి ఫోటో, విభూది మరియు పులిహార, స్వీట్ ప్రసాదంగా అందజేసిరి.

ఈ కార్యక్రమంలో  SSS సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు శ్రీ గంగుల రమణబాబు,శ్రీకాకుళం జోనల్ కన్వీనర్ Dr. L. లక్ష్మణరావు, పెద్ద మందిరం కన్వీనర్ శ్రీ A. జగ్గునాయుడు, గ్రామసేవ కార్యక్రమ దాత శ్రీ రంగారావు, పర్తియాత్ర కో ఆర్డి నేటర్ శ్రీ కాసం శ్రీనివాసరావు, క్రియాశీల కార్యకర్తలు, సాయి యువత, మహిళలు, మొత్తం 75 మంది మరియు గ్రామ సర్పంచ్ శ్రీ సాధు మల్లేశ్వర రావు, గురువు బసవరాజు, చల్ల రాజారావు, గ్రామ పెద్దలు యువత పాల్గొనిరి. సేవదళ్ సభ్యులకు అల్పాహారాన్ని శ్రీ వడగ దీన బాంధవరావు గారు భక్తితో ఏర్పాటు చేసిరి.స్వామివారికి హరతితో కార్యక్రమము ముగిసినది. స్వామి వారి పాదాల చెంత కొన్ని ఫోటోలు సమర్పించడ మైనది .

రిపోర్ట్,  శ్రీ కాసం శ్రీనివాసరావు వారి సహకారంతో

Report by: R.Kishor, Dist. IT coordinator, Srikakulam, Phone : 8332041839

Help Lines: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. / This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.

OAG0

OAG1

OAG2

OAG3

OAG4

OAG6

     

Activities
Youth Activities
Bala Vikas Activities