Wed01242018

Last update10:50:21 PM

SWATCHATHA SE DIVYATHA THAK :2017 (SRIKAKULAM)

శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుండగు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యఆశీస్సులతో శ్రీకాకుళం జిల్లాలో వివిధ సమితుల ఆధ్వర్యంలో"స్వచ్చత నుండి దివ్యత్వం వరకు"కార్యక్రమంలో భాగంగా తే02-10-2017ది నుండి తే20-10-2017ది వరకు పారిశుధ్య కార్యక్రమాలు జరిగాయి. ముందుగా శ్రీకాకుళం పట్టణంలోని పన్నెండు శ్రీ సత్యసాయి మందిరాల నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ గంగుల రమణ బాబు వారిఆధ్వర్యంలో రెండు గ్రూపులుగా ఏర్పడి రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలూ మరియు దేవాలయాల సముదాయము శివాలయం పరిసర ప్రాంతాలలో ఉదయం 6 గంటలనుండి 9గంటల వరకు సుమారు 77మంది సేవాదళ్ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా జిల్లావ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా సమితి, పాలకొండ, పలాస,కాశీబుగ్గ,టెక్కలి వారు ఏరియా ఆసుపత్రి ప్రాంగణములలోను మరియు చిదిమి, వాటపాగు, సంతకవిటి,గోరువానిపేట, బూర్జ, వేనమ్మపేట, రాజాం సుందరం,సోంపేట, సన్యసిపుట్టుగ, పారాపురం, ముద్దాడపేట, కృష్ణచంద్రపురం, డొంకూరు మొదలగు సమితులు/భజన మండళ్ళు  సేవా కార్యక్రమాలు నిర్వహించి  శ్రీకాకుళం జిల్లా ద్వారా 2535 పనిగంటలు  నిర్వహించారు. శ్రీకాకుళం పట్టణంలో వివిధ ప్రాంతములలో మొక్కలు నాటారు. స్వామి అవతార ప్రకటన దినోత్సవం వరకు మురికివాడల ప్రాంతాలలోను పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించదమే కాకుండా ఆయా ప్రాంతాలలో ఉన్న వివిధ పాఠశాలలు, కళాశాలల లోనూ స్వచ్ఛత నుండి దివ్యత్వం వరకు అనే అంశము మీద అవగాహన కల్పించి వ్యాసరచన, వకృత్వ పోటీలు మరియు క్విజ్ పోటీలు నిర్వహించినట్లు  జిల్లా అధ్యక్షుల వారు తెలియజేశారు.బూర్జ మండలంలో గల గిరిజన గ్రామం “ అలిపల్లిగూడ”లొ జిల్లా యువత అధ్వర్యంలో  గిరిజనులకు దోమ తెరల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో  జిల్లా యువ విభాగ కో ఆర్డినేటర్ శ్రీ గురు ప్రసాద్ , గౌరవ జిల్లా ప్రాదేశిక సభ్యులు శ్రీ అన్నెపు రామకృష్ణ, బూర్జ మండల  అభివృద్ధి అధికారి శ్రీ రవీంద్రబాబు పాల్గొన్నారు. ఫోటోలు స్వామి పాదాల చెంత సమర్పించడమైనది.

Report by: R.Kishor, District IT Incharge, Srikakulam, Phone:8332041839

chidimi1chidimi1

goru2kasibugga2

kbm31rajam sundar1

skl4sklm3

plk1vata12

8f082943 7bbc 4bb9 b40b 56e91cd7ee07

Activities
Youth Activities
Bala Vikas Activities