Mon01222018

Last update11:10:52 PM

SWATCHATHA SE DIVYATHA THAK (SRIKAKULAM) 02-10-2016

స్వచ్ఛత నుండి దివ్యత్వం వరకు (02-10-2016)

 

శ్రీమద్ అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుండగు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్యఆశీస్సులతో శ్రీకాకుళం జిల్లాలో వివిధ సమితుల ఆధ్వర్యంలో "స్వచ్చత నుండి దివ్యత్వం వరకు" కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు అనగా 02-10-2016 న పారిశుధ్య కార్యక్రమాలు జరిగాయి. ముందుగా శ్రీకాకుళం పట్టణంలోని పన్నెండు శ్రీ సత్యసాయి మందిరాల నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఆర్. లక్ష్మణరావు గారు మరియు జిల్లా అధ్యక్షులు శ్రీ గంగుల రమణ బాబు వారి ఆధ్వర్యంలో రెండు గ్రూపులు ఏర్పడి రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి అప్రోచ్ రహదారి 1.5 కిమీ పొడవునా మరియు హడ్కో కాలనీ, శివాలయం పరిసర ప్రాంతాలలో ఉదయం 6 గంటలనుండి 11 గంటల వరకు సుమారు 75 మంది పురుష సేవాదళ్ మరియు 50 మంది మహిళా సేవాదళ్ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా జిల్లావ్యాప్తంగా శ్రీ సత్యసాయి సేవా సమితి, పాలకొండ, పలాస వారు ఏరియా ఆసుపత్రి ప్రాంగణములలోను మరియు టెక్కిలి, కోటబొమ్మాళి, హీరమండలం, సంతకవిటి మొదలగు సమితులతో పాటు వివిధ భజన మండళ్ళు కూడా సేవా కార్యక్రమాలు నిర్వహించి మొదటి రోజు రాష్ట్రములోనే అత్యధికముగా 1907 మాన్ అవర్ నిర్వహించారు. రాబోయే స్వామి అవతార ప్రకటన దినోత్సవం వరకు మురికి వాడల ప్రాంతాలలోను పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించదమే కాకుండా ఆయా ప్రాంతాలలో ఉన్న వివిధ పాఠశాలలు, కళాశాలల లోనూ స్వచ్ఛత నుండి దివ్యత్వం వరకు అనే అంశము మీద అవగాహన కల్పించి వ్యాసరచన, వకృత్వ పోటీలు మరియు క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుల వారు తెలియజేశారు. ఫోటోలు స్వామి పాదాల చెంత సమర్పించడమైనది.

రిపోర్ట్ : శ్రీ ఆర్. కిషోర్, జిల్లా ఆర్కైవ్స్, శ్రీకాకుళం జిల్లా

swa1

swa11

swa3

swa4

swa5

swa6

swa7

swa8

swa9

swa10

Activities
Youth Activities
Bala Vikas Activities