Vocational Training Convocation-Koti
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశిస్సులతో, శ్రీ సత్య సాయి సేవ సంస్థలు, కోటి సమితి , హైదరాబాద్, ఒకేషనల్ ట్రైనింగ్ లో టైలరింగ్ లో 5వ బ్యాచ్ లో 1-3-2017 నుండి 2-6-2017 వరకు దాదాపు 90 రోజుల శిక్షణ పూర్తి గావించిన 20 మందికి, ఒకేషనల్ ట్రైనింగ్ కవొకేషన్ ను అబిడ్స్, జి. పుల్లారెడ్డి భవనము లో గల శ్రీ సత్య సాయి సాయి స్టడీ సర్కిల్, ప్రాంగణములో,ఈ రోజు సాయంత్రము 4-30 గంటలకు, వేదపఠనము, భజన, స్వామి వారి దర్శనముతో, కార్యక్రమము ప్రారంభము గావించబడినది. కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి స్వాగత వచనములు పలుకిన తదనంతరము ఈ నాటి కార్యక్రమమునకు ముఖ్య అతిధిగా విచ్చేసిన, తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షలు శ్రీ ఎస్ జి చలమ్, జ్యోతి ప్రకాశనం గావించారు. శ్రీమతి రేణుక, ఒకేషనల్ ట్రైనింగ్ కార్యక్రమ వివరాలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు, 100 మంది, శిక్షణ పొందినట్లు, తెలియజేసారు.
రాష్ట్ర అధ్యక్షలు శ్రీ ఎస్ జి చలమ్, సుశిక్షితులైన 20 మందికి, సర్టిఫికెట్స్ బహుకరణ, మరియు ఏప్రిల్ మాసములో నిర్వహించిన, సమ్మర్ క్యాంపు లో పాల్గొన్న 30 మంది బాల బాలికలకు సర్టిఫికెట్స్ బహుకరణ, మరియు, సత్య సాయి సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ లో వైద్యము పొందిన కుటుంబము నకు నేషనల్ నారాయణ సేవ గా, బియ్యము, కందిపప్పు, నూనె, అందించి, 4 వ బ్యాచ్లో శిక్షణ పొందిన కుమారి జ్యోతి కి ఒక కుట్టు మిషన్ కూడా కోటి సమితి పక్షాన బహుకరించారు.
రాష్ట్ర అధ్యక్షలు, మాట్లాడుతూ, ఈ మహా పట్టణములో ఇంత మంది ఉండగా వీరే ఈ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ పొందారంటే, ఇది కేవలం, స్వామి సంకల్పమే అని అంటూ, ఏ కార్యమైనా, భక్తితో, నిష్ఠతో, కొనసాగించాలని, మీరు కొనసాగించారని, పాల్గొన్న ప్రతి వారికీ అభినందనలు, తెలుపుతూ, కోటి సమితి సభ్యులను, టైలారింగ్ కోచ్ పద్మావతి గారిని, కోటి సమితి బాలవికాస్ విద్యార్థులకు, శుభాకాంక్షలు తెలియ జేస్తూ, మీరు కూడా మాతో అనేక సమాజ సేవ కార్యక్రమాలలో, పాల్గొని, మన మంతా స్వామి దివ్య ఆసిస్సులు, పొందుదామన్నారు.
ఈ కార్యక్రమములో, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు శ్రీ ఎం వి ఆర్ శేష సాయి,డాక్టర్ . కృష్ణ కుమార్, విష్ణు వర్ధన్, లక్ష్మ రెడ్డి, శ్రీమతి సీత మహాలక్ష్మి, పద్మజ, రేణుక, విజయ లక్ష్మి, సునీత, తదితరులు పాల్గొన్నారు. శ్రీ సత్య సాయి సేవ సమితి, కోటి సమితి పక్షాన, రాష్ట్ర అధ్యక్షలు శ్రీ ఎస్ జి చలం గారిని సమితి సభ్యులు అందరూ కలసి, సముచితముగా, సత్కరించుకొని, ఆనంద పడ్డారు. రాష్ట్ర అధ్యక్షలు, శ్రీ ఎస్ జి. చలం భగవానునికి, మంగళ హారతి సమర్పణతో, కానవొకేషన్ కార్యక్రమము, ముగిసినది.
కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి వందన సమర్పణ గావిస్తూ, 6 వ బ్యాచ్ టైలరింగ్ లో శిక్షణ స్థానికుల నుండి సెల్ నెంబర్ లో 94404 09410,. 88865 09410, సంప్రదించి, పేరు నమోదు చేసుకోవలసిందిగా కోరారు.
For more Photos click the link below
https://goo.gl/photos/iFu8qwcPSAFSQNt5A
News Coverage